అయిజ నియోజకవర్గం ఏర్పాటు చేయాలి

July 21, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 21 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీనీ నియోజకవర్గం. చెయ్యాలి తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సింధనూర్ ఉప్పరి గంగాధర్ మాట్లాడుతూ అయిజ మండలం సమీపంలో చుట్టుపక్కల గ్రామాలు ఎన్నో ఉన్నాయి జోగులాంబ గద్వాల జిల్లాలోని అతిపెద్ద మండలం అయిజ కనుక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు అప్పుడున్న టిఆర్ఎస్ పార్టీ అయిజను నియోజక వర్గం చేస్తా అని చెప్పి పది సంవత్సరాలు ప్రజలను మభ్య పెడుతూ వచ్చింది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వమైన అయిజ ను నియోజకవర్గం చేస్తదని ప్రజలు ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా నియోజకవర్గం చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అయిజ ను నియోజకవర్గం చేయకపోతే ప్రజలను చైతన్యం చేస్తూ ఉద్యమం చేయటానికైనా సిద్ధమే అంటున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ. జోగులాంబ గద్వాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సింధనూర్ ఉప్పరి గంగాధర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల్ జిల్లా మీడియా ఇంచార్జ్ యు.రాముడు అయిజ మండల ప్రధాన కార్యదర్శి జుంజు కృష్ణ,రాజపురం ఇ సురేందర్ గౌడ్ నాగరాజు ఆంజనేయులు, భాస్కర్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper