అలంపూర్ గడ్డ సంపత్ కుమార్ అడ్డా: మల్లమ్మకుంట రిజర్వాయర్‌పై కాంగ్రెస్ మార్క్ దిమ్మతిరిగే షాక్‌లో బిఆర్ఎస్ గులాబీ బ్యాచ్
జనం న్యూస్ 08 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ *అలంపూర్ ప్రజా గర్జన:*శాసనసభలో ఉన్నా బయట ఉన్నా పదవి ఉన్నా లేకపోయినా అలంపూర్ నియోజకవర్గ ప్రజల కన్నీళ్లను తుడవడమే ధ్యేయంగా ప్రతి క్షణం ప్రజల గుండెల్లో బతికే ఏకైక సిసలైన ప్రజా నాయకుడు మన ప్రియతమ నేత డా. ఎస్. ఏ. సంపత్ కుమార్ అలంపూర్ నియోజకవర్గ రైతాంగం దశాబ్దాల కల తుమ్మిళ్ళ లిఫ్ట్ కింద మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణంఈ చారిత్రాత్మక కల ఈరోజు సాకారమైంది అంటే దానికి కారణం కేవలం సంపత్ కుమార్ అలుపెరగని పట్టుదల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మన ప్రాంతంపై ఉన్న ప్రత్యేక ప్రేమేనని మరోసారి రుజువైంది సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి చెబితే అది కదా సంపత్ కుమార్ పవర్ నిన్న కాకమొన్న అధికారంలోకి వచ్చి లంకె బిందెలు ఇస్తామని మాటలు చెప్పి చేతులు దులుపుకునే రకం కాదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చరవాణి (ఫోన్) ద్వారా మన సంపత్ కుమార్ కి ఫోన్ చేసి సంపత్ అన్న మల్లమ్మకుంట రిజర్వాయర్ ఫైల్ అంతా వందకు వంద శాతం రెడీ అయ్యింది గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాం ఇక పనులు చూసుకో మన రైతన్నలను ఒప్పించి మెప్పించి వారికి కావలసిన పూర్తి పరిహారాన్ని అందించి భూసేకరణ త్వరగా పూర్తి చేయి అని చెప్పడం సంపత్ కుమార్ నిరంతర పోరాటానికి దక్కిన అసలైన గౌరవం విజయం అలంపూర్ ఆర్డీఎస్ నీటి కోసం తుమ్మిళ్ళ లిఫ్ట్ సాధన కోసం రిజర్వాయర్ల నిర్మాణం కోసం ఎండనక వాననక సంపత్ కుమార్ చేసిన పాదయాత్రలు ధర్నాలు నేడు ఫలితాన్ని ఇచ్చాయి సీఎం మాట వినగానే ప్రజల కష్టాలు తీరబోతున్నాయనే ఆనందంతో సంపత్ కుమార్ కళ్లలో ఆనందభాష్పాలు రాలిన క్షణం అలంపూర్ చరిత్రలోనే నిలిచిపోతుంది పాలభిషేకాలతో హోరెత్తిన అలంపూర్ శ్రేణుల్లో నయా జోష్ ఈ మహత్తర శుభవార్త తెలియగానే అలంపూర్ నియోజకవర్గవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఆనందోత్సాహాల్లో ఉన్న రైతులు గ్రామగ్రామాన పండగ చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన అలంపూర్ ముద్దుబిడ్డ సంపత్ కుమార్ చిత్రపటాలకు పాలభిషేకాలు చేస్తూ నినాదాలతో హోరెత్తిస్తున్నారుఇది కదా అసలైన ప్రజా ప్రభుత్వం ఇది కదా లీడర్ అంటే బిఆర్ఎస్ తుప్పు బ్యాచ్ నాయకులారా ఏ మొహం పెట్టుకొని వస్తారు సిగ్గుచేటు ఇప్పుడు అసలు విషయానికి వద్దాం గత పదేళ్ల నయా నవాబుల బిఆర్ఎస్ ప్రభుత్వంలో అలంపూర్ ప్రజలకు రైతులకు దక్కింది ఏంటి తుప్పు పట్టిన పైపులు అబద్ధపు ప్రగల్భాలు కమిషన్ల కక్కుర్తిఅధికారంలోకి వస్తే రిజర్వాయర్ల నిర్మాణం చేపడతామని మోసం చేసి గద్దెనెక్కిన తర్వాత ప్రజల ఆశలపై నీళ్లు చల్లిన ఘనత మీది కాదా పదేళ్లు అధికారంలో ఉండి ఒక్క అడుగు ముందుకు వేయని చేతగాని దద్దమ్మలు మీరు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సంపత్ కుమార్ కష్టపడి రాత్రింబగళ్లు శ్రమించి ఫైల్ క్లియర్ చేయించి పనులకు గ్రీన్ సిగ్నల్ ఇప్పిస్తే మేమేదో చేశాం పొడిచాం అంటూ బిఆర్ఎస్ నాయకులు ఇప్పుడు డ్రామాలు ఆడటానికి క్రెడిట్ కొట్టేయడానికి సిగ్గులేకుండా రెడీ అవుతున్నారట మీకు అసలు సిగ్గు శరం మానప్రేమ ఉంటే ఏ మొహం పెట్టుకొని అలంపూర్ గడ్డపై అడుగుపెడతారు అధికారంలో ఉండి రైతులను ముంచిన మీ చేతగానితనాన్ని ఒప్పుకోవడానికి వస్తున్నారా ల్లేక అలంపూర్ ప్రజలకు మోసం చేసినందుకు ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పడానికి వస్తున్నారా గులాబీ కండువాలు కప్పుకుని తిరిగే నాయకులారా మీ డ్రామాలు మీ అబద్ధాల కాలం చెల్లిపోయింది. మీ తుప్పు పట్టిన రాజకీయాలను కడిగిపారేయడానికి అలంపూర్ రైతాంగం సిద్ధంగా ఉంది రైతులకు అండగా కాంగ్రెస్ తిరుగులేని ఏకైక నేత సంపత్ కుమార్ భూసేకరణ విషయంలో బిఆర్ఎస్ లాగా రైతుల పొట్ట కొట్టే ప్రభుత్వం కాదు కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులను అన్ని విధాలుగా ఆదుకోవడానికి, వారికి తగిన గరిష్ట సహాయం, పరిహారం అందించి న్యాయం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. మాట ఇస్తే మడమ తిప్పని నైజం సీఎం రేవంత్ రెడ్డి ది ప్రజా సమస్యలపై ప్రాణాలైనా అడ్డుపెట్టే పోరాట గుణం సంపత్ కుమార్ ది ఇకనైనా ప్రతిపక్ష బిఆర్ఎస్ నాయకులు తమ చౌకబారు చిల్లర రాజకీయాలు మానుకోవాలి అలంపూర్ అభివృద్ధికి మల్లమ్మకుంట రిజర్వాయర్ పనులకు అడ్డుపడాలని చూస్తే ఇక్కడి రైతులు ప్రజలు మిమ్మల్ని ఊర్లలోకి రానివ్వకుండా తరిమితరిమి కొట్టడం ఖాయం అలంపూర్ సింహం సంపత్ కుమార్ నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి జై జై సంపత్ కుమార్