ఆగస్టు 10 వ తేదీన జైల్ బారో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కరపత్రం విడుదల.
జనం న్యూస్ జూలై 28 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు మానుకోవాలి._ సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కడారి నాగరాజు.కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలు మానుకోవాలని దేశ వ్యాప్తంగా సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆగష్టు 10 న జైలు బారో కార్యక్రమం నిర్వహించాలని పిలుపునిచ్చినట్లు సీఐటీయూ మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు కడారి నాగరాజు తెలిపారు. ఈ సందర్బంగా నర్సాపూర్ పట్టణంలో జైల్ బారో ప్రచార కరపత్రం విడుదల చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ
కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగడుతూ గ్రామ,గ్రామాన ,బస్తీలు ,పారిశ్రామిక, నివాస ప్రాంతాల్లో విస్తృతంగా సభలు, సమావేశాలు నిర్వహించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కడారి నాగరాజు పిలుపు నిచ్చారు. కార్పోరేట్ అనుకూల నిర్ణయిస్తామని చెప్పిన బిజెపి ప్రభుత్వం ఉత్పత్తి ధరను తగ్గించి నిర్ణయించడం వల్ల గిట్టుబాటు ధర రావడం లేదన్నారు. కనీస మద్దతు ధరల చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించాలని ఆందోళన చేస్తున్నప్పటికీ కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉందన్నారు . రుణవిమోచన చట్టం చేయాలని కోరుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం చేయడం లేదన్నారు . రైతులకు గిట్టుబాటు ధరలతో పాటు, పంట రుణాల సౌకర్యం, ప్రకృతి వైపరీత్యాల నష్టపరిహారం, బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.వామపక్షాల పోరాట ఫలితంగా 2005లో “మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి గ్యారంటీ చట్టం-2005″రూపొందిందని, దీని ప్రకారం వ్యవసాయ కార్మికులకు సం॥లో 100 రోజుల పని కల్పించాలి