ఎన్నికలప్పుడు కొట్లాడదాం.. ఇప్పుడు కూకట్‌పల్లి అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం

August 8, 2026 | తెలంగాణ

జనం న్యూస్ ఆగస్టు 8 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ; కూకట్‌పల్లి నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పార్టీలకు అతీతంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బండి రమేష్ అన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయంగా పోరాడదామని, ప్రస్తుతం కూకట్‌పల్లి అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేద్దామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు తాను కోరినట్లు తెలిపారు.కూకట్‌పల్లి వసంత్‌నగర్ డివిజన్‌లోని ఎస్ ఎం ఆర్, విశ్వంభర కాలనీల్లో నియోజకవర్గ నాయకులు మాకినేని యాక నారాయణ వినోద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా పాదయాత్రకు బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ పాదయాత్రలో కాలనీ వాసులు, డివిజన్ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా బండి రమేష్ కాలనీల్లో పర్యటిస్తూ ప్రజలను పేరుపేరునా పలకరించి, వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా ఉన్న రోడ్లు, డ్రైనేజీ, మౌలిక వసతులు తదితర సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.కూకట్‌పల్లి అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ జేఎన్టీయూ సమీపంలో స్కైవాక్, గోపాల్‌నగర్–మంజీరా రోడ్ అభివృద్ధి పనుల గురించి ప్రస్తావించారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని మైసమ్మ చెరువు, కాముని చెరువు, సున్నం చెరువు, ఐడియల్ చెరువులను హైడ్రా సహకారంతో ఆక్రమణల నుంచి విముక్తి కల్పించి, వాటిని అభివృద్ధి చేసి సుందరీకరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.కూకట్‌పల్లి నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారంపై సిఎంసి కమిషనర్ సృజన ని కలిసి చర్చించానని, సమస్యలపై ఆమె సానుకూలంగా స్పందించారని చెప్పారు. ప్రాధాన్యతా క్రమంలో నిధులు కేటాయించి, తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చినట్లు బండి రమేష్ తెలిపారు.“కూకట్‌పల్లి అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి పనిచేయాలి. ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయంగా పోరాడుదాం.. కానీ ప్రజల సమస్యలు, నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కలిసి ముందుకు సాగుదాం” అని బండి రమేష్ స్పష్టం చేశారు.వసంత్‌నగర్ ప్రాంత ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించిన యాక నారాయణ వినోద్ మరియు నిర్వాహకులను బండి రమేష్ అభినందించారు.ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్ బాబు, సాయిబాబు చౌదరి, రంగమోహన్, చవ్వ శ్రీనివాస్, మాధవరెడ్డి, శివరామకృష్ణ, నవీన్, గోపాల్ చౌదరి, రమణ, వాసు, సంధ్య తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper