ఐ. పోలవరం మండలం ఎదుర్లంక గ్రామంలో రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ
జనం న్యూస్ ఆగస్టు 4 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ) కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీ-సర్వే కార్యక్రమం భాగంగా రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమం ఈరోజు ఐ. పోలవరం మండలం ఎదుర్లంక గ్రామంలో నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో గౌరవ ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు శ్రీ దాట్ల సుబ్బరాజు గారు, మాజీ శాసనసభ్యులు శ్రీ చెల్లి వివేకానంద గారు, ఐ. పోలవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ సాగిరాజు సూరిబాబు రాజు గారు మండల తాసిల్దార్ గారు పాల్గొని లబ్ధిదారులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను అందజేశారు.ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యుల వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల భూ హక్కులకు భరోసా కల్పిస్తూ పారదర్శక భూ రికార్డుల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలు రైతులకు శాశ్వత భద్రతను కల్పించే ముఖ్యమైన పత్రాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో కూటమి ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రైతులు, గ్రామ ప్రజలు మరియు మీడియా మిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.