
రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అభినందనలు –
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని సీఐ హామీ
జనం న్యూస్ జూలై 23 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ స్వామి గౌడ్‌ను రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జనంపల్లి పురంధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వివేకానంద నగర్ సెక్టార్ ఎస్ఐ నర్మదా మేడం, ఎస్ఐ చంద్రశేఖర్‌లను కూడా శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా సీఐ డి. స్వామి గౌడ్ మాట్లాడుతూ, కూకట్పల్లి ప్రాంతంలో బోనాలు, వినాయక చవితి వంటి ప్రధాన పండుగలు అత్యంత వైభవంగా జరుగుతాయని, భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు శాఖ తరఫున అన్ని విధాలా భద్రతా ఏర్పాట్లు చేపడతామని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు.జనంపల్లి పురంధర్ రెడ్డి మాట్లాడుతూ, కూకట్పల్లి పోలీసు అధికారులు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ శాంతియుత వాతావరణంలో పండుగలు నిర్వహించేందుకు విశేషంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారంలో పోలీసు శాఖ అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొంటూ నూతన సీఐ డి. స్వామి గౌడ్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు జి. ప్రసాద్, కేవీ రావు, సూర్యనారాయణ, నాని, అఖిల్, యశ్వంత్ తదితరులు పాల్గొని నూతన సీఐతో పాటు ఎస్ఐలకు శుభాకాంక్షలు తెలియజేశారు.