కేదార్లంకలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
జనం న్యూస్ సెప్టెంబర్ 4 ముమ్మిడివరం ప్రతి నిధి గ్రంధి నానాజీ కపిలేశ్వరపురం మండలం కేదార్లంకలో సాదా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సత్యానందం మరియు హిందూ ధార్మిక నాయకులు విచ్చేశారు. ముందుగా పలు ఆధ్యాత్మిక భజనా కార్యక్రమాలు ప్రారంభించారు. కేదార్లంక, వీధివార్లంక గ్రామాలకు చెందిన మహిళలు చిన్నారులు కోలాటం కార్యక్రమం ఎంతో ఉత్సాహభరితంగా జరిపారు. ఈ సందర్భంగా పాలూరి మాట్లాడుతూ శ్రీకృష్ణుడు జీవితం ఎంతో ఆదర్శవంతంగా నడిచిందనీ, భగవద్గీత ద్వారా మనిషి ధర్మంగా ఎలా నడుచుకోవాలో నేర్పించిన మార్గదర్శమూర్తి శ్రీ కృష్ణ పరమాత్మ అని అన్నారు. అనంతరం కేదార్లంక గ్రామ పెద్దలు మరియు హిందూ ధార్మిక కార్యకర్తలు ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్న లక్ష్మీనారాయణ ను మరాయు గ్రామస్తులను పాలూరి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కేదార్లంక మాజీ సర్పంచ్ రంకిరెడ్డి వెంకటేశ్వరరావు, బిజెపి యువమోర్చ రాష్ట్ర కార్యదర్శి పాలూరి జయప్రకాశ్ నారాయణ, బిజెపి యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు కోటిపల్లి దామోదర్, ఆర్ఎస్ఎస్ నాయకులు తొగరు సీతారామాంజనేయులు, సిద్ధంశెట్టి గంగారావు,కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు చోడ పనీడి నాగబాబు, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు అన్యం సత్యనారాయణ,ఆత్మ కమిటీ డైరెక్టర్ పాలాటి మాధవస్వామి,ఎస్సీ మోర్చ మండల అధ్యక్షుడు తరిట్ల శివరామకృష్ణ, కేదార్లంక గ్రామపెద్దలు అన్యం శివాజీ, పోలిశెట్టి బ్రహ్మయ్య, అన్యం గోవిందు,తదితరులు మరియు గ్రామస్తులు హిందూ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.