గని శెట్టి అరవింద్ జన్మదిన వేడుకలు బీజేపీ నాయకుల శుభాకాంక్షలు
జనం న్యూస్ జూలై 16 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం,సన్నవల్లి గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీ యువ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గని శెట్టి అరవింద్ జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు ఘనంగా పాల్గొన్నారు పార్టీ నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు అరవింద్‌కు పూలమాలలు వేసి, కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అరవింద్ యువతలో పార్టీని బలోపేతం చేసేందుకు చేస్తున్న కృషిని కొనియాడారు.ఈ కార్యక్రమానికి ముమ్మిడివరం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు గొల్ల కోటి వెంకటరెడ్డి, భారతీయ జనతా పార్టీ జిల్లా కోశాధికారి గ్రంధి నానాజీ, మార్కెట్ కమిటీ సభ్యులు మట్ట సూరిబాబు తదితరులు హాజరై అరవింద్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.గని శెట్టి అరవింద్ మాట్లాడుతూ, పార్టీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని యువతకు మంచి భవిష్యత్ కోసం కృషి చేస్తానని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నాయని, యువత అందరూ పార్టీలోకి వచ్చి సేవ చేయాలని పిలుపునిచ్చారు.జన్మదిన సందర్భంగా గ్రామంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినారు ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ నాయకులు, యువ మోర్చా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య ముగిసింది.