బిఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకులు పెట్టిన అక్రమ కేసులో జహీరాబాద్ కోర్టుకు హాజరైనా బిఆర్ఎస్ నాయకులు
జనం న్యూస్ 16 జూలై జహీరాబాద్ నియోజకవర్గంలోని బిఆర్ఎస్ నాయకులు జహీరాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ సీనియర్ నాయకులు నామా రవి కిరణ్ ,కొమారి జగదీష్ ,ఆనందం ,ఎర్రోళ్ల శివప్ప ,రాథోడ్ భీం రావ్ ,హీరు రాథోడ్ లు జహీరాబాద్ పట్టణంలోని కోర్టులో హాజరయ్యారు ఈ సందర్బంగా మాట్లాడుతూ జహీరాబాద్ ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో 19.07.2025 నాడు సెట్విన్ సంస్థకు సంబంధించిన అధికారిక కార్యక్రమం నిర్వహించి స్టేజి బ్యానరులో దళిత ఎంఎల్ఏ అయిన జహీరాబాద్ శాసన సభ్యులు గౌరవనీయులు కొనింటి మాణిక్ రావు * ఫోటో ఎందుకు వేయలేదు అని ప్రోటోకాల్ పాటించడం లేదని కార్యక్రమం అయిపోయిన తర్వాత అక్కడి అధికారులను అడిగి *నిరసన వ్యక్తం చేయడం జరిగిందని తెలిపారు ఇదే విషయాన్ని అదునుగా భావించి కాంగ్రెస్ నాయకులూ పోలీసులపై ఒత్తిడి చేయించి మాపై బలవంతంగా కేసులు పెట్టించి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని ఆవేదస వ్యక్తం చేశారు ఈ రోజు కోర్టులో బెయిల్ తీసుకోవడం జరిగిందని న్యాయ వ్యవస్థ పై మాకు పూర్తి విశ్వాసం ఉందని తప్పకుండ చివరకు న్యాయమే గెలుస్తుందని తెలిపారు కౌన్సిలర్లు మహిపాల్ ,అబ్దుల్లా , శ్రీనివాస్ , గోవింద్ రాథోడ్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు