గ్రామసభలో చారిత్రక రావిచెట్టును రక్షించి, రచ్చకట్టను పునర్నిర్మించాలని అధికారులకు పెద్దతాండ్రపాడు గ్రామస్తుల వినతి
జనం న్యూస్ 26 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : రాజోలి మండలం పెద్ద తాండ్రపాడు గ్రామంలో ఈరోజు గ్రామసభ సర్పంచ్ సుబ్బారెడ్డి అధ్యక్షతన నిర్వహించబడింది. ఈ గ్రామసభలో గ్రామ పెద్దలు యువకులు ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు గ్రామంలోని సుమారు 70 సంవత్సరాలకు పైబడిన చారిత్రక సాంస్కృతిక ప్రాధాన్యం కలిగిన రావిచెట్టును పరిరక్షించాలని చెట్టు చుట్టూ అక్రమంగా నిర్మించిన షాపులు మరియు కాంపౌండ్ వాల్‌ను తొలగించి పూర్వ వైభవాన్ని ప్రతిబింబించే రచ్చకట్ట (కలిగేరి కట్ట/మీశాల కట్ట)ను పునర్నిర్మించాలని గ్రామస్తులు అధికారులను ఏకగ్రీవంగా కోరారు.ఈ సందర్భంగా ఎంపీడీవో ఎంపీఓ ఎస్ఐ పంచాయతీ కార్యదర్శి విఆర్వో కి గ్రామస్తులు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం అధికారుల సమక్షంలో గ్రామస్థుల సంతకాలను స్వీకరించి, గ్రామ ప్రజల ఏకాభిప్రాయాన్ని నమోదు చేశారు.గ్రామస్తులు మాట్లాడుతూ ఈ రావిచెట్టు కేవలం ఒక వృక్షం మాత్రమే కాకుండా గ్రామ చరిత్రకు, సామాజిక ఐక్యతకు, పూర్వీకుల జ్ఞాపకాలకు ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు.