ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా నందలూరు: అమరవీరుల త్యాగ ఫలితమే స్వాతంత్రం అని ఎంపీపీ మేడ విజయభాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. 80 వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శనివారం మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేసి వందనం సమర్పించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ మేడ విజయభాస్కర్ రెడ్డి, ఎంపీడీవో కె ఆర్ ఎం ప్రసాద్, మండల కో ఆప్షన్ సభ్యులు కలీం, వైస్ యం పి పి తుమ్మల భావన శ్రీధర్ గౌడ్, నాయనపల్లి అనుదీప్ జై సింహ, ఎంపీటీసీలు పొత్తపి చంద్ర , సోమిశెట్టి సునీత ప్రభాకర్ ,షేక్ సుభాన్, పునగాని గుణ యాదవ్ ,విద్యార్థినిలుమండలం మహిళా అధ్యక్షు రాలు పల్లె మాధవి ,ప్రజా ప్రతినిధులు గీతాల నర సింహారెడ్డి, బూసి రెడ్డి రాజ శేఖర్ రెడ్డి, అక్కి మోహన్ రెడ్డి, గంగి నాయుడు, దివాకర్ రెడ్డి, విజయుడు, పల్లె గ్రీష్మంత్ష్ రెడ్డి ,కాకిచంద్ర నాగసుబ్బయ్య , ముమ్మడిశెట్టి సుధాకర్, తుమ్మల శ్రీధర్ గౌడ్ ప్రజా నాయకులు గొబ్బిళ్ళ సురేష్ , షాజహాన్, కరిముల్లా,తదితరులు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి గౌరవ వందనం చేశారు. ఈ సంద ర్భంగా రాజంపేట నియోజక వర్గం స్థాయిలో ఆరు మండ లాల్లో నందలూరు మండలం ఎంపీడీవో మండల అభివృద్ధిలో ప్రథమ స్థానం పొందడం విధి నిర్వ హణలో కడప జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా మెడల్ పొందు తున్న సందర్భంగా మండల పరిషత్ అధ్యక్షులు మేడ విజయభాస్కర్ రెడ్డి మరియు కో-ఆప్షన్స్ సభ్యులు ఎంపీటీసీల చేతుల మీదుగా ఆయనకు సన్మానం నిర్వ హించారు. లేబాక్ యూత్ సాయి, నాగేంద్ర, సునీల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మండల పరిషత్ అధ్యక్షులు మేడ విజయభాస్కర్ రెడ్డి కి గజమాలతో ఘన స్వాగతం పలికారు.