అకాడమిక్ ఇన్ స్ట్ర క్టర్లకోసందరఖాస్తుల ఆహ్వానం
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా నందలూరు: మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమి కోన్నత పాఠశాలల్లో ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ అకడమిక్ ఇన్స్ట్రక్టర్ ఉద్యోగాల కొరకు ఈనెల 16వ తేదీ నుండి 21వ తేదీలోగా మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో( ఎం ఆర్ సి) దరఖాస్తుచేసుకోవాలని మండల విద్యాశాఖ అధికారి ఎల్ నాగయ్య తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ 16 ఎస్జీటీ పోస్టులు, నాలుగు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీలుఉన్నాయన్నారు. అభ్యర్థులు ఇంటర్మీడియట్ , డీఎడ్, లేదా డిగ్రీ , బిఎడ్ పాసై టెట్ అర్హత ఉండాలన్నారు. రెండు సెట్ల విద్యా అర్హత, టెట్ మార్క్స్ కార్డు, నివాసధ్రువీకరణ పత్రాల జిరాక్స్ కాఫీలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు.