మునగపాక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కరణం ధర్మశ్రీ, బొడ్డేడ ప్రసాద్ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకావిష్కరణ చేసి గౌరవ వందనం చేశారు.
జనం న్యూస్ ఆగస్టు 15 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం మునగపాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైయస్సార్ సిపి మాజీ ప్రభుత్వ విప్ ఎలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ, మరియు వైయస్సార్సీపి అనకాపల్లి జిల్లా అధ్యక్షులు పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పతావిష్కరణ చేసి మండల వైసీపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరియు విద్యార్థులకు స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసి మిఠాయిలు అందజేశారు. అనంతరం బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన సమరయోధులను గుర్తుచేసుకొని వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని దేశభక్తి భావాన్ని చాటుతూ భావితరాలు ఆ దిశగా నడిచేలా సమిష్టిగా కృషి చేద్దాం అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఆడారి గణపతి అచ్చినాయుడు మరియు ఎంపీపీ మొల్లేటి కృష్ణవేణి నారాయణరావు,మరియు ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు,గ్రామ పెద్దలు పిల్లలు తదితరులు పాల్గొన్నారు.//