చిత్తారమ్మ దేవాలయంలో ఘనంగా బోనాల పూజలుఅమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలి: చౌదరి శ్రీనివాసరావు

August 9, 2026 | తెలంగాణ

జనం న్యూస్ ఆగస్టు 9 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి బోనాల పండుగను పురస్కరించుకుని ఆదివారం వేకువ జామునే కూకట్‌పల్లిలోని చిత్తారమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి.ఈ సందర్భంగా చౌదరి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. చిత్తారమ్మ అమ్మవారి చల్లని చూపు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. అమ్మ వారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నారు. ముఖ్యంగా విద్యార్థులు తమకు నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.బోనాల పండుగ సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారని చౌదరి శ్రీనివాసరావు పేర్కొన్నారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన కోరారు. పండుగ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి.

🌐 Select Language:
📰 ePaper