
జనం న్యూస్ నందలూరుకడప జిల్లా.రాజంపేట భారతీయ జనతాపార్టీ పార్లమెంటరీ అధ్యక్షులు సాయి లోకేష్ సహకారంతో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి ని నందలూరు రైల్వే కన్సల్టేటివ్ మెంబర్ రాచూరి మురళి మర్యాద పూర్వకంగాకలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ఆయన మాట్లాడుతూ మండలంలో ప్రఖ్యాతి చెందిన శ్రీ సౌమ్యనాథ స్వామి దేవస్థానం నందు ప్రతిరోజు కొన్ని వేలమంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తూ ఉంటారని వారికి తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే నిత్య అన్నదానం ఏర్పాటు చేయవలసినదిగా కోరారు.ఈ సందర్భంగా భాను ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ఖచ్చితముగా నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి దేవ స్థానంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే నిత్య అన్నదానం కచ్చితంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు రాచూరి మురళి తెలియ జేశారు.ఈ కార్యక్రమంలో కడప జిల్లా భారతీయ యువ మోర్చా కార్యదర్శి దాసరి వెంకటరమణ గౌడ్,నందలూరు మండలం బిజెపి అధ్యక్షులు చుక్కా శ్రీనివాసులు, మండల ఉపా ధ్యక్షులు సివి సుబ్బయ్య బిజెపి మండల నాయకులు తిరుపతి వెంకటరమణ పాల్గొన్నారు.