
బిచ్కుంద, జూలై 4 జనం న్యూస్ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మరియు విద్యా రంగానికి సంబంధించిన పలు సమస్యల పరిష్కారం కోసం మహా ధర్నా విజయవంతం చేయాలి అని విజ్ఞప్తి చేయడం జరిగింది.ఈ సందర్భంగా తపస్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు అవసరమైన సౌకర్యాల కల్పన, ఖాళీ పోస్టుల భర్తీ, పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అలాగే ఉపాధ్యాయుల సేవా సంబంధిత సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ధర్నా కు అందరూ తరాలిరావాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ఆనంద్, తపస్ రాష్ట్ర వెబ్సైట్ కన్వీనర్ యం రమేష్ కుమార్, తపస్ కామారెడ్డి జిల్లా సేవా కన్వీనర్ రచ్చ శివకాంత్, తపస్ బిచ్కుంద మండల అధ్యక్షులు ముత్యాల సందీప్, ప్రధాన కార్యదర్శి పేర్శెట్టి శంకర్, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ దత్తా గౌడ్, సభ్యులు ఎన్నార్ రాజ్ కుమార్, ఆనంద్, అనిల్ రెడ్డి , సాయిలు, సహదేవ్, హన్మండ్లు సంఘ సభ్యులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.