
జనం న్యూస్ నందలూరు కడప జిల్లాఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నందలూరు సివిల్ జడ్జి కోర్ట్ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడరుగా (ఏజీపీ) నియమితులైన వి. వినయ్ ని నందలూరు రైల్వే కన్సల్టిట్యూట్ మెంబర్ రాచూరి మురళి మరియు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డాక్టర్ డేవిడ్ కళ్యాణి రాజు కలసి నందలూరులో ఘనంగా శాలువాతో సత్కరించి, శుభా కాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ తమఆనందాన్నిపంచుకున్నారు.డాక్టర్ డేవిడ్ కళ్యాణి రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వి.వినయ్ మాట్లాడుతూ, తన బాధ్య తలను సక్రమంగా నిర్వర్తిస్తూ న్యాయ వ్యవస్థకు, ప్రజలకు సేవనందిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమం లో వీరబల్లి జయ కుమార్ రెడ్డి (రాయలసీమ రీజినల్ డ్రగ్స్ మరియు క్రైమ్ చైర్మన్)పఠాన్ మెహర్ ఖాన్
శివన్ (రైల్వే సీనియర్ కాంట్రాక్టర్)కత్తి చంద్ర తదితరులు పాల్గొన్నారు.