నిరుపయోగంగా ఉన్న గ్రామ పంచాయతీ నూతన భవనం
జనం న్యూస్ 20 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మండల కమిటీ సభ్యులు రాజాపురం ఈ. సురేందర్ గౌడ్ మాట్లాడుతూ జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం రాజాపురం గ్రామంలో 20 లక్షలతో నూతన భవనం నిర్మించడం జరిగింది. ఇంతవరకు ఓపెనింగ్ చేయడానికి గవర్నమెంట్ అధికారులు కావచ్చు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనపడటం లేదు గ్రామ పంచాయతీ కార్యాలయం ఒక స్కూల్లో ఉండడం జరిగింది స్కూల్ విద్యార్థులకు ఉపాధ్యాయులకు గ్రామస్తులకు ఇబ్బందికరంగా మారుతుంది. కావున ఈ నూతన భవనాన్ని అతి త్వరలో ప్రారంభం చేస్తే గ్రామస్తులకు గ్రామ ప్రజలకు అందరికీ మంచి జరుగుతుంది.జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం రాజాపురం గ్రామం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఈ నూతన భవనాన్ని అతి త్వరలో ఓపెన్ చేస్తే అందరికి మంచి జరుగుతుందని ప్రతిరోజు స్కూల్ భవనంలో గ్రామ కార్యాలయం ఉండటంతో విద్యార్థులకు ఇబ్బందిగా మారుతుంది. పంచాయతీ భవనం లేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సందర్భంగా అతి త్వరలో గ్రామ పంచాయతీ కార్యాలయం ఓపెనింగ్ చేయకపోతే తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరపు నుండి ఎంత దూరమైన వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాము. అని తెలంగాణ రాజ్యాధికార పార్టీ మండల కమిటీ సభ్యులు ఇ సురేందర్ గౌడ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు. టీ పరమేష్ టి.పెద్దయ్య,కె. సీడ్ పత్తి రంగన్న కె సెలివి రంగన్న, టి హనుమంతు టి నారాయణ, కె. కొండన్న, టి.దన్నాడ రంగన్న,