నీట్ పేపర్ లీకేజ్ కి నిరసనగాబిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నందికొండలో విద్యాసంస్థల బంద్

July 24, 2026 | తెలంగాణ

జనం న్యూస్- జూలై 24- నాగార్జునసాగర్ టౌన్-దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీ అవకతవకలకు, ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జికి నిరసనగాబిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు నాగార్జునసాగర్ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ ఆదేశానుసారం బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు నందికొండలో విద్యాసంస్థల బంద్ విజయవంతంగా నిర్వహించారు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలల వద్దకు చేరుకుని యాజమాన్యాలకు నచ్చజెప్పి తరగతులను నిలిపివేశారు, విద్యార్థులు అధ్యాపకులు విద్యా సంస్థలను మూసివేసి బందుకు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ పేపర్ లీకేజ్ కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టి ఏ) ను వెంటనే రద్దు చేయాలి, పేపర్ లీకేజ్ కి కారకులైన ప్రధాన సూత్రధారులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలి, ఈ కుంభకోణంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించి బాధితులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, లక్షలాదిమంది పేద, మధ్యతరగతి విద్యార్థుల కష్టాన్ని కేంద్ర ప్రభుత్వ అలసత్వం నీరుగార్చిందని విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు, ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper