పీజీఆర్‌ఎస్ సేవలపై ప్రజల అభిప్రాయాల సేకరణకు క్యూ ఆర్ కోడ్ వినియో గించండి:-ఎం పి డి వో కే ఆర్ ఎం ప్రసాద్

July 20, 2026 | తెలంగాణ

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా.ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) ద్వారా అందిస్తున్న సేవలపై ప్రజల అభిప్రాయాలను సేకరించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగారూపొందిం చిన పీజీఆర్‌ఎస్ ఫీడ్‌బ్యాక్ క్యూ ఆర్ కోడ్ను ప్రజలు తప్పనిసరిగా వినియోగించాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి K. R. M ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.మండలం లో ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్ సమావేశాలకు హాజరయ్యే ప్రజలు తమ వినతులు, ఫిర్యాదులు సమర్పించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన పీజీఆర్‌ఎస్ ఫీడ్‌బ్యాక్ క్యూ ఆర్ కోడ్‌ను తమ మొబైల్ ఫోన్ ద్వారా స్కాన్ చేసి, అందించిన సేవలపై తమ విలువైన అభిప్రాయాలను నమోదు చేయాలని కోరారు.ప్రజల నుండి అందే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా సేవల నాణ్యతను మరింత మెరుగుపరచేందుకు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా, మండల పీజీఆర్‌ఎస్ కేంద్రాలు, కలెక్టరేట్, మండల కార్యాలయాలు, గ్రామ/వార్డు సచివాలయాలు, నోటీస్ బోర్డులు, హెల్ప్ డెస్కులు, ఫిర్యాదు కౌంటర్లు మరియు ఇతర ప్రజా ప్రదేశాల్లో క్యూ ఆర్ కోడ్‌ను ప్రదర్శించడం జరుగు తుందని పేర్కొన్నారు.జిల్లాలోని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పీజీఆర్‌ఎస్ సేవలపై తమ అభిప్రాయాలను నమోదు చేసి, ప్రజా సేవల మెరుగుదలకు సహకరించాలని మండల అభివృద్ధి అధికారి విజ్ఞప్తి చేశారు.

🌐 Select Language:
📰 ePaper