పూడిమడకలో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి వేడుకలు
జనం న్యూస్, సెప్టెంబర్ 02,అచ్యుతాపురం :దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలను అచ్యుతాపురం మండలం పూడిమడకలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రైతులు, పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.ముఖ్యమంత్రిగా ఆయన అమలు చేసిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108 అత్యవసర సేవలు, జలయజ్ఞం వంటి పథకాలు ప్రజల జీవితాల్లో ఎంతో మార్పు తీసుకొచ్చాయని అన్నారు.వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికీ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాయని పేర్కొన్నారు. వైఎస్ఆర్ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు,వైస్ ఎంపీపీ వాసుపల్లి శ్రీనివాసరావు,వైసీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు చోడిపల్లి అప్పారావు,మాజీ వైస్ ఎంపీపీ ఉమ్మిడి అప్పారావు, జిల్లా అధికార ప్రతినిధి ఉమ్మిడి జగన్, యూత్ నాయకులు ఏరిపల్లి భాను, మేరుగు రాజేష్, వార్డు సభ్యులు మేరుగు అప్పలరాజు, ఏరిపల్లి పైడియ్య, పొన్నమళ్ళ తాతారావు, దాసరి శ్రీనివాసరావు, ఈరిగిల అప్పారావు మరియు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.