వైఎస్ఆర్ 17వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

September 2, 2026 | తెలంగాణ

కూకట్పల్లి కెపిహెచ్బీ టెంపుల్ బస్‌స్టాప్‌లో ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమం.

జనం న్యూస్ సెప్టెంబర్ 2 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన మహానేత వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు: బండి రమేష్ కూకట్పల్లి నియోజకవర్గం కెపిహెచ్బీ టెంపుల్ బస్‌స్టాప్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమం స్థానిక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు రాజేష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ హాజరయ్యారు.ఈ సందర్భంగా బండి రమేష్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్థానికులకు పండ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నేటికీ ప్రజల జీవితాల్లో చెరగని ముద్ర వేశాయని గుర్తు చేశారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతులు మరియు పేద ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన అనేక కార్యక్రమాల ద్వారా వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు.పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలిచి, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిదని బండి రమేష్ పేర్కొన్నారు. వైఎస్ఆర్ చూపిన ప్రజాసేవా స్ఫూర్తితోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రజాపాలనను కొనసాగిస్తోందని అన్నారు.ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు, పేదలు, రైతులు, మహిళలు, యువత మరియు అన్ని వర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరంతరం కృషి చేస్తున్నారని బండి రమేష్ తెలిపారు. వైఎస్ఆర్ ఆశయాలను, ప్రజాసేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో బి-బ్లాక్ అధ్యక్షులు తూము వేణు సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు డిసిసి వైస్ ప్రెసిడెంట్ రాఘవేంద్ర కెపిహెచ్బీ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు అరవింద్ రెడ్డి ఖైతలాపూర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు కలికోట శంకర్ కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు నాగార్జున మాజీ డివిజన్ అధ్యక్షులు కృష్ణ రాజ్‌పుత్ సతీష్ గౌడ్ సీనియర్ నాయకులు గంధం రాజు ఫణీంద్ర బ్లాక్ మహిళా అధ్యక్షురాలు సంధ్య గారు, ఏఎంసీ డైరెక్టర్ సుధాకర్ రెడ్డి ఏఎంసి వైస్ చైర్మన్ ప్రకాష్ ముదిరాజ్ తదితర ముఖ్య నాయకులు, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper