మద్య నిషేధంపై గ్రామసభ -ఏకగ్రీవ తీర్మానం – సర్పంచ్ మహేష్

September 2, 2026 | వైరల్ వార్తలు

మద్నూర్ సెప్టెంబర్ 2 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లారా గ్రామ పంచాయతీ
పెద్ద ఎక్లారా గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయాలని గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.ఈ నిర్ణయంతో పెద్ద ఎక్లారా గ్రామం మద్నూర్ మండలంలో ఆదర్శంగా నిలిచింది.- గ్రామసభలో పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజల సమక్షంలో మద్యం విక్రయాలు, సరఫరాను పూర్తిగా నిషేధించాలని తీర్మానించారు.- గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సర్పంచ్ మహేష్, ఉపసర్పంచ్ సంగ్రామ్ పటేల్ కోరారు.- గ్రామసభ తీర్మానానికి విరుద్ధంగా ఎవరైనా గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయించినా, సరఫరా చేసినా వెంటనే పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులకు సమాచారం అందించాలని గ్రామసభ నిర్ణయించింది.చట్టాలు, నిబంధనల ప్రకారం సంబంధిత వ్యక్తులపై తగిన చర్యలు తీసుకునేలా చూడాలని తీర్మానంలో పేర్కొన్నారు.మద్యం కారణంగా సంతోషంగా ఉండాల్సిన కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని, మద్యానికి బానిసైన వారి ఆరోగ్య పరిస్థితులు రోజురోజుకూ క్షీణిస్తున్నాయని సర్పంచ్, ఉపసర్పంచ్ పేర్కొన్నారు.బుధవారం నాడు స్థానిక ఎక్సైజ్ ఎస్సై నాగేష్ గౌడ్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మండల పంచాయతీ అధికారి, మద్నూర్ ఎస్సై మోహన్ రెడ్డికి గ్రామసభ తీర్మానం పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మహేష్, ఉపసర్పంచ్ సంగ్రామ్ పటేల్, అభిషేక్ పటేల్, బాబు గోండ తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper