ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు – చట్టాలపై విద్యార్థులకు అవగాహన

July 25, 2026 | వైరల్ వార్తలు

బిచ్కుంద జులై 25 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి), బిచ్కుందలో శనివారం విద్యార్థుల్లో చట్టాలపై అవగాహన పెంపొందించేందుకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల వైస్ ప్రిన్సిపల్ డా. జి. వెంకటేశం అధ్యక్షత వహించారు.ముఖ్య అతిథిగా హాజరైన బిచ్కుంద జూనియర్ సివిల్ జడ్జి శ్రీ జాడ వినీల్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని వివరించారు. సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం 1930 టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌ను వినియోగించుకోవాలని సూచించారు. అలాగే వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం 1915 టోల్‌ఫ్రీ నంబర్‌ను ఉపయోగించుకోవచ్చని తెలిపారు. మోటార్ వెహికల్ చట్టం, పోక్సో (POCSO) చట్టం, న్యాయ వ్యవస్థ పనితీరుపై విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించి, వారి సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.ఈ సందర్భంగా ఏఎస్‌ఐ దేవరాజ్ మోటార్ వెహికల్ చట్టంలోని ముఖ్య నిబంధనలను వివరించారు. సీనియర్ అడ్వకేట్ ఎం. లక్ష్మణరావు విద్యార్థులు విద్యతో పాటు సత్ప్రవర్తనను అలవర్చుకోవాలని సూచించారు. అడ్వకేట్ మల్లేశం బాలల హక్కులు, బాలల రక్షణకు సంబంధించిన చట్టాలను వివరించి, ఉచిత న్యాయ సలహాల కోసం 15100 టోల్‌ఫ్రీ నంబర్‌ను వినియోగించుకోవాలని సూచించారు.రాజనీతి శాస్త్ర విభాగాధిపతి డా. టి. అశోక్‌రావు మాట్లాడుతూ విద్యార్థులకు చట్టాలపై విలువైన అవగాహన కల్పించేందుకు కళాశాలను వేదికగా ఎంచుకుని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ముఖ్య అతిథులు, న్యాయవాదులకు కళాశాల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం కళాశాల అధ్యాపకులు ముఖ్య అతిథి ని శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినీ–విద్యార్థులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper