తెలంగాణ

కొండా లక్ష్మణ్ బాపూజీ పోరాటం స్ఫూర్తిదాయకం కాంగ్రెస్ మండల అధ్యక్షులు బుచ్చిరెడ్డి

కొండా లక్ష్మణ్ బాపూజీ పోరాటం స్ఫూర్తిదాయకం కాంగ్రెస్ మండల అధ్యక్షులు బుచ్చిరెడ్డి

జనం న్యూస్ సెప్టెంబర్ 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమ ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బుచ్చిరెడ్డి మాట్లాడుతూ…తెలంగాణ కోసం జీవితాంతం పోరాడిన ఉద్యమ నేత, స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని పేర్కొన్నారు. బాపూజీ సేవలు, త్యాగాలు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దుబాసి కృష్ణమూర్తి, బాసాని రవి, మారపల్లి రాజేందర్, వరదరాజు, వడ్డేపల్లి శ్రీనివాస్, వినుకొండ శంకరాచారి, అంకేశ్వరపు కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు..

ఇ-పేపర్