భారతదేశ అభివృద్ధి కోసం శ్రీ వాణి స్కూల్ విద్యార్థులతో ప్రతిజ్ఞ

August 16, 2026 | తెలంగాణ

జనం న్యూస్;16 ఆగస్టు ఆదివారం; సిద్దిపేట నియోజికవర్గం ఇంచార్జ్ వై.రమేష్ ; సిద్దిపేటలోని శ్రీ వాణి స్కూల్‌లో బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో “10 కోట్ల వ్యక్తుల ప్రతిజ్ఞ – మహా ఉద్యమం” కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రతినిధి బి.కె. ఓంకారం శ్రీ వాణి పాఠశాల విద్యార్థులతో కలిసి భారతదేశ అభివృద్ధి కోసం ప్రతిజ్ఞ చేయించారు. ఆరోగ్యకరమైన జీవితం, సమాజ శ్రేయస్సు, దేశ ప్రగతి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు.ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ సి.హెచ్. సత్యం మాట్లాడుతూ, విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే దేశభక్తి, బాధ్యతాయుతమైన పౌరసత్వం, మంచి ఆలోచనలు పెంపొందించడం ఎంతో అవసరమన్నారు. భారతదేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని సూచించారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంపొందించేందుకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper