భువన విజయం పద్యాల తోరణం కళా ప్రదర్శనతో అలరించిన రాఘవాపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు

August 16, 2026 | తెలంగాణ

జనం న్యూస్ :16 ఆగస్టు ఆదివారం సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జ్ వై.రమేష్:ఆనాటి తెలుగు వైభవాన్ని కళ్లకు కట్టినట్లు ఆవిష్కరించిన విద్యార్థులు – గ్రామ పెద్దల ప్రశంసలు_రాఘవాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో “భువన విజయం – పద్యాల తోరణం” కళా ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు కంతుల శ్రీశైలం స్వయంగా రచించి, రూపొందించిన ఈ ప్రత్యేక కళా ప్రదర్శనను శశి యాదవ్ సమన్వయం తో విద్యార్థులు అత్యంత ప్రతిభావంతంగా ప్రదర్శించారు.తెలుగు భాషా వైభవాన్ని, ఆనాటి సాహితీ సంపదను, పద్యాల మాధుర్యాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన “భువన విజయం” ప్రదర్శనలో విద్యార్థులు తమ నటన, పద్య పఠనం, సంభాషణలు, హావభావాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆనాటి తెలుగు సాహిత్య వైభవాన్ని విద్యార్థులు కళ్లకు కట్టినట్లు ఆవిష్కరించిన తీరు గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులను విశేషంగా ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శ్రీమతి పద్మ శ్రీనివాస్ ఉప సర్పంచ్ శ్రీ కంతుల వెంకట్ విద్యార్థుల అద్భుత ప్రతిభను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసే ఇలాంటి కార్యక్రమాలు పాఠశాల స్థాయిలో మరిన్ని నిర్వహించాలని వారు ఆకాంక్షించారు.విద్యార్థుల బహుముఖ ప్రతిభకు అభినందనలు_పాఠశాల ప్రధానోపాధ్యాయులు _ శ్రీమతి మంజు భార్గవి మాట్లాడుతూ, విద్యార్థుల్లో కేవలం పాఠ్యాంశాలపై అవగాహన మాత్రమే కాకుండా భాషా నైపుణ్యాలు, సృజనాత్మకత, వేదికపై మాట్లాడే సామర్థ్యం, కళాత్మక ప్రతిభ పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.చదువుతో పాటు క్రీడల్లో కూడా విద్యార్థులు విశేషంగా రాణిస్తున్నారని పేర్కొంటూ, వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన చిన్నారులను ప్రధానోపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు.వ్యాయామ ఉపాధ్యాయులు * ఏర్వ అశోక్ ఆధ్వర్యంలో క్రీడల్లో విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి ప్రోత్సహించారు. విద్యార్థులు విద్య, సాహిత్యం, కళలు, క్రీడలు వంటి అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చెందేలా పాఠశాల ఉపాధ్యాయ బృందం కృషి చేస్తోందని తెలిపారు.ఉపాధ్యాయులు, సిబ్బంది వేడుకలు విజయవంతం అవడంలో విశేష కృషి చేశారు.ఈ కార్యక్రమంలో బల్ల చంద్రమౌళి, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శశి యాదవ్, దీవెనమ్మ, రమేష్, అశోక్,శ్రీశైలం, మమత, స్వామి, శోభారాణి, భాగ్యలక్ష్మి,ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper