రాష్ట్ర ప్రభుత్వం మరియు వ్యవసాయ శాఖ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి రైతు నేస్తం కార్యక్రమం 100వ ఎపిసోడ్

July 28, 2026 | తెలంగాణ

బిచ్కుంద జూలై 28 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని బిచ్కుంద రైతు వేదికలో రైతుల సమక్షంలో ఘనంగా తిలకించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంటల యొక్క సలహాలు సూచనలు నేరుగా శాస్త్రవేత్తల ద్వారా అందించడానికి రైతు వేదికల ద్వారా ప్రతి మంగళవారం దృశ్యమాధ్యమ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు వివిధ వ్యవసాయ మరియు ఉద్యాన పంటల సాగు, పాడి పశువుల పెంపకం, కోళ్ల పెంపకం మరియు ఇతర వ్యవసాయ అనుబంధ రంగాలపై సూచనలను రైతులకు తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం విజయవంతంగా నేటితో 100 వ ఎపిసోడ్ పూర్తి చేసుకునే సందర్భంగా ప్రతి రైతు వేదిక ద్వారా రైతులతో గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుత ఎల్ ని నో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు వరికి బదులుగా ఇతర ఆరుతడి పంటలు వేసుకోవడానికి వీలుగా ఈనెల 27 నుండి 29 తారీకు వరకు రైతు వేదికలలో ఆరుతడి పంటల విత్తనాలతో విత్తన మేళా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రైతులు రైతు నేస్తం కార్యక్రమం తో పాటు విత్తన మేళా లో ప్రదర్శించిన విత్తనాలను సందర్శించి అవసరమైన రైతులు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పుల్కల్ సొసైటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి , మండల వ్యవసాయ అధికారి, రాజుల సర్పంచ్ , మాన్యపూర్ సర్పంచ్ , ఫత్లాపూర్ సర్పంచ్ , ఉప సర్పంచ్ వ్యవసాయ విస్తరణ అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper