రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలి.
జనం న్యూస్ జూలై 21 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రం లోని రైతు వేదికలోని రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ క్లస్టర్ ఆఫీసర్ సత్యనారాయణ, రైతులతో మాట్లాడుతూ ఈ ఏడాది వాతావరణ పరిస్థితుల్లో ఎల్ ని నో ప్రభావం ఉండి భూగర్భ జలాలు తగ్గుతాయి. వర్షాలు తక్కువ నమోదు అయి ఉన్నాయి. కావున రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలి కావున ఆయిల్ పామ్ సాగు చేయాలి ప్రభుత్వము మొక్క సబ్సిడీ డ్రిప్ సబ్సిడీ ఇస్తుంది. ఎకరాకు 4200 రూపాయలు రైతు ఖాతాలో జమ చేస్తుంది. హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ కంపెనీ డ్రిప్పుకు ఒక ఎకరాకు 5000 రూపాయలు చొప్పున చెల్లిస్తుంది. కావున రైతులు ఆయిల్ పామ్ పంట సాగు చేయడానికి ముందుకు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ కృష్ణారెడ్డి, పి ఎ సి ఎస్ చైర్మన్ నాగరాజు, రెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ కదిరి గోపాల్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్లు నర్సింలు, శంకర్ రెడ్డి, రాజు, కృష్ణారెడ్డి, వార్డ్ మెంబర్ నేతుల మల్లేశం, రైతులు పాల్గొన్నారు.