రోడ్డు పనులు ప్రారంభించాలి. రోడ్ విస్తరణ బాధితులకు నష్టపరిహారం అందించాలి.
జనం న్యూస్:వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ వనపర్తి జిల్లా పెబ్బేరు జులై 21-07-2026 మంగళవారం వనపర్తి–పెబ్బేరు ప్రధాన రహదారి విస్తరణలో భాగంగా ఇళ్లు కోల్పోయిన బాధిత కుటుంబాలకు తక్షణమే నష్టపరిహారం అందించి, రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు, రోడ్డు బాధితులతో కలసి మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు.అయితే రోడ్డు విస్తరణ కారణంగా ఇళ్లు పూర్తిగా లేదా పాక్షికంగా కోల్పోతున్న కుటుంబాలకు ప్రభుత్వం తగిన నష్టపరిహారం కల్పించడం తన బాధ్యత అని పేర్కొన్నారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గణేష్‌కు, మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్‌కు బీజేపీ నాయకులు మరోసారి వినతిపత్రం అందజేశారు.రోడ్డు విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయడంతో పాటు బాధితులకు ఆలస్యం చేయకుండా నష్టపరిహారం అందించాలని కోరారు.వినతిపత్రంపై స్పందించిన మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, రోడ్డు విస్తరణలో పూర్తిగా నష్టపోయిన వారు, కొంత మేర నష్టపోయిన వారి వివరాలను ఇప్పటికే అధికారులు సేకరించి జాబితా సిద్ధం చేశారని తెలిపారు. వచ్చే నెలలో అవసరమైన ప్రక్రియలు పూర్తి చేసి అర్హులైన బాధితులకు ఇంటి స్థలాలు (ప్లాట్లు) కేటాయించే చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.అలాగే రోడ్డు విస్తరణ పనులపై మాట్లాడుతూ, మూడు నుంచి నాలుగు ఇళ్ల వరకు పూర్తిస్థాయిలో ప్రభావం పడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే సూచన మేరకు “38 ఫీట్లు వరకు రోడ్డు విస్తరణకు సడలింపు ఇచ్చినట్లు తెలిపారు. ఆ పరిమితిని దాటి రోడ్డు పరిధిలో ఉన్న నిర్మాణాలను మాత్రం నిబంధనల ప్రకారం తొలగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో రోడ్డు విస్తరణ బాధితులు, బీజేపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, పాల్గొని బాధితులకు సంఘీభావం తెలిపారు.END