విధి నిర్వహణలో సేవలకు ప్రశంస.కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌కు ప్రశంస పత్రం

August 16, 2026 | తెలంగాణ

జనం న్యూస్ ఆగస్టు 16 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్న శాయంపేట పోలీస్‌స్టేషన్‌ కానిస్టేబుల్‌ దుంపటి శ్రీనివాస్‌కు ప్రశంస లభించింది. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమం లో అదనపు కలెక్టర్‌ రవి చేతుల మీదుగా ఆయన ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. మండలంలోని కొప్పుల గ్రామ పోలీసుగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్‌ ప్రజల సమస్యలపై స్పందిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ విధి పట్ల అంకితభావంతో సేవలందిస్తున్నందుకు గుర్తింపుగా ప్రశంస పత్రం అందుకోవడం పట్ల స్థానిక పోలీసులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు…..

🌐 Select Language:
📰 ePaper