520 మార్కులు సాధించిన విద్యార్థికి గ్రామపంచాయతీ పాలకవర్గం సన్మానం

August 16, 2026 | తెలంగాణ

జనం న్యూస్ ఆగస్టు 16 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో పదవ తరగతి పరీక్షల్లో 520 మార్కులు సాధించిన కుసుమ నాగ గణేష్ ను గ్రామపంచాయతీ పాలకవర్గం సత్కరించింది. గ్రామంలో జరిగిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో ప్రిన్సిపాల్ మాధవి జెండా ఆవిష్కరణ అనంతరం 2025-2026 పదవ తరగతిలో 520 మార్కులు సాధించిన విద్యార్థి కుసుమ నాగ గణేష్ కు గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ గజ్జి ఐలయ్య, ఉప సర్పంచ్ తుడుం రాజు లు రూ.1000 నగదు బహుమతి అందజేశారు.ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులు మాట్లాడుతూ కుసుమ నాగ గణేష్ సాధించిన ప్రతిభ గ్రామానికి గర్వకారణం. ఇలాంటి విద్యార్థులు మరింత మంది రావాలని” ఆకాంక్షించారు. చదువులో మరింత రాణించి ఉన్నత స్థానానికి చేరుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో హైస్కూల్ ప్రిన్సిపాల్ మాధవి ,ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ప్రైమరీ స్కూల్ చైర్మన్ వైద్యుల కవిత ఉపాధ్యాయులు, వార్డు మెంబర్లు, నాలిక వీర ప్రతాప్, పోతుగంటి ప్రమీల, గజ్జి రాజు, అంకేశ్వర పు సాయి లక్ష్మి, కోడిమాల మహేందర్, గజ్జి రమేష్ గడ్డమీది హారతి ఐరబోయిన స్వప్న చిట్టి రెడ్డి పద్మ కందకట్ల ప్రవీణ్ కుమార్ తుడుం స్రవంతి, స్వయం సహాయక సంఘం అధ్యక్షులు బిఆర్ఎస్ నాయకులు తుడుం వెంకటేష్, కాంగ్రెస్ నాయకులు పెరుమాండ్ల భద్రయ్య, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు….

🌐 Select Language:
📰 ePaper