శ్రీ పొట్టి శ్రీరాములు పార్క్‌ను పరిశుభ్రంగా ఉంచాలి: తర్లుపాడు ఎస్.ఐ బసవరాజు హెచ్చరిక.

August 18, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఆగస్టు 18.మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ సెంటర్‌లో గల శ్రీ పొట్టి శ్రీరాములు పార్క్‌లో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తర్లుపాడు ఎస్.ఐ బసవరాజు హెచ్చరించారు.పార్క్‌లో చెత్త వేసినా, మలమూత్ర విసర్జన చేసినా, అలాగే మండలంలో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించినా కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పార్క్ పరిసర ప్రాంతాల ప్రజలకు, తాగే నీటి ట్యాంక్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కల్పించారు.ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి శ్రీహరి మాట్లాడుతూ పార్క్ ఆవరణలో చెత్త వేయడం, మద్యం సేవించడం, మలమూత్ర విసర్జన చేయడం లాంటి పనులు పునరావృతం చేస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని, భారీగా జరిమానా కూడా విధిస్తామని తెలిపారు.ఈ అవగాహన కార్యక్రమంలో శ్రీశైలం వాసవి సముదాయ సత్రం కార్యదర్శి పోలేపల్లి జనార్దన్, వేణుగోపాల స్వామి ఆలయ ధర్మకర్త జవ్వాజి విజయ భాస్కర్, గ్రామ ప్రజలు దోగిపర్తి మల్లిఖార్జున, భవనం రామకృష్ణ రెడ్డి,చెక్కా బాలరంగం, గాదం శెట్టి సుబ్బారావు జవ్వాజి వెంకటేశ్వర్లు, గునుపూడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper