సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ హరీష్ బాలయోగి
(జనం న్యూస్ జూన్ 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో ఎంపీ కార్యాలయం నందు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎంపీ హరీష్ బాలయోగి పంపిణీ చేశారు. 52 మంది లబ్ధిదారులకు గాను 27,44,396/- (ఇరవై ఏడు లక్షల నలభై నాలుగు వేల మూడు వందల తొంభై ఆరు) రూపాయల విలువ గల చెక్కులను లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. వైద్యం ఖర్చులను రీయింబర్సుమెంట్ ద్వారా బాధితులకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కు లబ్దిదారులు మరియు ఎంపీ హరీష్ బాలయోగి కృతజ్ఞతలు తెలియజేశారు.