సీఐ సుధాకర్ రెడ్డి ఎస్సై పరమేశ్వర్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలకు విరాళం
జనం న్యూస్ జూన్ 22 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని మాందారిపేట గ్రామంలోని సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామ ప్రజా ప్రతినిధులు ముందుకు వచ్చారు ఈ మేరకు శాయంపేట సీఐ సుధాకర్ రెడ్డి ఎస్సై జక్కుల పరమేశ్వర్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ ఉపసర్పంచ్ లు సీసీ కెమెరాల ఏర్పాటుకు కోరకు టెక్నీషియన్ రూపాయలు 20000 వేల నగదును అందజేశారు ఈ సందర్భంగా సీఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగకరం అని తెలిపారు అనంతరం ఎస్సై జక్కుల పరమేశ్వర్ మాట్లాడుతూ మండలం లోని అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుని శాంతి భద్రతలను మరింత పటిష్టం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో తహరపుర్ గ్రామ సర్పంచ్ కుక్కల సరోజన ఉపసర్పంచ్ రావుల శ్రీనివాస్ చలివాగు ప్రాజెక్టు డైరెక్టర్ కుక్కల తిరుపతి తక్కల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు…