జనం న్యూస్ 01 అక్టోబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్బ్యా క్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని విజ్ఞప్తి వనపర్తి 30-09-2026: తెలంగాణ రాష్ట్ర ఉదయ్ దివ్యాంగుల అసోసియేషన్ యూత్ అసోసియేషన్ పిలుపు మేరకు వనపర్తి జిల్లాకు నూతన కమిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎం. శ్రీనివాసులు నూతన కమిటీని నియమించి, సభ్యులకు నియామక పత్రాలను అందజేశారు. నూతన కమిటీ వివరాలు: జిల్లా అధ్యక్షుడు: కె. చంద్రశేఖర్ఉ పాధ్యక్షుడు: గుర్రం బీచ్పల్లి జనరల్ సెక్రటరీ: గువ్వల మధు జాయింట్ సెక్రటరీ: హుస్సేన్అ డ్వైజర్: కె. శ్రీనివాసులు కోఆర్డినేటర్: శివశంకర్ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ఎం. శ్రీనివాసులు నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. జిల్లాలోని దివ్యాంగ నిరుద్యోగుల సమస్యలను జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి దృష్టికి తీసుకెళ్లి, వారి హక్కులు మరియు ఉద్యోగ అవకాశాల కోసం కృషి చేయాలని కమిటీ సభ్యులకు సూచించారు. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీపై ప్రధాన డిమాండ్లు గవర్నమెంట్ ఎమ్మెస్ నెంబర్ 19 ప్రకారం బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి గడువు పొడిగించిన నేపథ్యంలో వనపర్తి జిల్లాలో దివ్యాంగుల కోసం పెండింగ్‌లో ఉన్న బ్యాక్లాగ్ ఖాళీలపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఉదయ్ నూతన కమిటీ విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా క్రింది అంశాలను స్పష్టంగా పరిష్కరించాలని కోరుతున్నారు: వనపర్తి జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో దివ్యాంగులకు సంబంధించిన బ్యాక్లాగ్ ఖాళీలను గుర్తించాలి. ప్రతి శాఖలో కేటగిరీ వారీగా ఎన్ని బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయో అధికారికంగా వెల్లడించాలి. దివ్యాంగుల రిజర్వేషన్‌కు సంబంధించిన పాత ఖాళీలు, భర్తీ కాని పోస్టులు మరియు ప్రస్తుతం అందుబాటులో ఉన్న బ్యాక్లాగ్ పోస్టుల పూర్తి వివరాలను సేకరించాలి. 19లో పేర్కొన్న నిబంధనలు మరియు పొడిగించిన గడువు ప్రకారం బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలి. బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేసి, అర్హులైన దివ్యాంగ నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలి. ఇప్పటికే బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ప్రక్రియలు ఏ దశలో ఉన్నాయో శాఖల వారీగా స్పష్టమైన వివరాలను వెల్లడించాలి. దివ్యాంగుల రిజర్వేషన్‌కు సంబంధించిన పోస్టులను ఇతర కేటగిరీలకు మళ్లించకుండా, చట్టబద్ధమైన రిజర్వేషన్ నిబంధనల ప్రకారం దివ్యాంగులతోనే భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలి. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలో వైకల్యం కేటగిరీల వారీగా (పిడబ్ల్యూ బీడీ కాటన్ అసోసియేషన్) వర్తించే రిజర్వేషన్ నిబంధనలను సక్రమంగా అమలు చేయాలి. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి సంబంధించి జిల్లా స్థాయిలో ప్రత్యేక సమీక్ష నిర్వహించి, ఖాళీలను గుర్తించడం నుంచి నియామకాలు పూర్తయ్యే వరకు కాలపరిమితితో కూడిన కార్యాచరణ రూపొందించాలి. అర్హత ఉన్నప్పటికీ గతంలో ఉద్యోగ అవకాశం పొందలేకపోయిన దివ్యాంగ నిరుద్యోగులకు పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అధికారులకు విజ్ఞప్తి వనపర్తి జిల్లాలోని దివ్యాంగ నిరుద్యోగులు ఎన్నో సంవత్సరాలుగా బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో, సంబంధిత అధికారులు ఈ అంశాన్ని ప్రాధాన్యతగా తీసుకుని ఖాళీల గుర్తింపు, వివరాల ప్రకటన, నోటిఫికేషన్, ఎంపిక మరియు నియామక ప్రక్రియలను వేగవంతం చేయాలని ఉదయ్ వనపర్తి జిల్లా నూతన కమిటీ విజ్ఞప్తి చేస్తోంది. దివ్యాంగుల ఉద్యోగ హక్కులను పరిరక్షిస్తూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయడం ద్వారా వనపర్తి జిల్లాలోని దివ్యాంగ నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుతున్నాము. ఈ కమిటీ ఎన్నిక కార్యక్రమానికి హాజరైన దివ్యంగులు నాగర్ కర్నూల్ ఉదయ్ జనరల్ సెక్రటరీ సాయిబాబు. మెకానిక్ ఆంజి నాయక్. ఎల్లస్వామి తథతితరులు పాల్గొన్నారు.