ఆంధ్రప్రదేశ్

రక్తదానం. ప్రాణదానంతో సమానం

రక్తదానం. ప్రాణదానంతో సమానం

జనం న్యూస్, అక్టోబర్ 03, అచ్యుతాపురం: అచ్యుతాపురం మండలం పూడి ఆర్అండ్ఆర్ కాలనీ వైస్సార్ నగర్ ఎంపీయుపి స్కూల్ వద్ద గాంధీ జయంతి సందర్బంగా మహాత్మా గాంధీ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరమునకు విశేష స్పందన రావడం జరిగిందని, పిల్లలకు, మహిళలకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేయడం జరిగిందని నిర్వాహకులు రాజాన సంజీవ్ మరియు వారి మిత్ర బృందం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదానం కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, రక్తదాన శిబిరం నిర్వహించుట వల్ల ఎంతోమందికి ప్రాణాన్ని, పునర్జన్మని ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాసవరపు కాసుబాబు, లాలం నరేంద్ర, కోడూరు పవన్, లాలం హేమంత్ కుమార్, రాజాన కార్తిక్ తదితర యువకులు మరియు కాలనీ ప్రజలు పాల్గొన్నారు.

ఇ-పేపర్