ఆంధ్రప్రదేశ్

-మహాత్ముడి ఆశయాలే దేశ ప్రగతికి మార్గదర్శకం

-మహాత్ముడి ఆశయాలే దేశ ప్రగతికి మార్గదర్శకం

సత్యం, అహింస సిద్ధాంతాలతో ప్రపంచానికి దిశానిర్దేశం చేసిన మహాత్మా గాంధీ- జనం న్యూస్ అక్టోబర్ 2 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ గాంధీ చూపిన మార్గంలో నడవడం ప్రతి భారతీయుడి బాధ్యత : ఘన నివాళులు అర్పించిన రాష్ట్ర కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్-, జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రామచంద్రపురంలో గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలోని కుమ్మరవీధి, మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి మంత్రి సుభాష్,ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ ఏవిఆర్ఆర్ రాజులతో కలిసి నివాళులర్పించారు.అనంతరం చల్లావారి వీధిలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు బాధ్యత చాటారు.తర్వాత కృత్తివెంటి పేర్రాజు పంతులు ప్రభుత్వ పాఠశాల ఆవరణలోని గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహాత్మా గాంధీ ప్రపంచానికి సత్యం, అహింస,శాంతి సందేశాలను అందించిన మహోన్నత వ్యక్తి అని,ఆయన చూపిన మార్గమే దేశ అభ్యున్నతికి బాటలు వేసిందని అన్నారు. యువత గాంధీ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ సేవకు ముందుకు రావాలని, పరిశుభ్రత,క్రమశిక్షణ, మానవతా విలువలను ఆచరించడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కూటమి పార్టీ నాయకులు, మున్సిపల్ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

ఇ-పేపర్