జనం న్యూస్ -అక్టోబర్ 2- నాగార్జునసాగర్ టౌన్- నందికొండ మున్సిపల్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను నందికొండ మున్సిపల్ చైర్ పర్సన్ స్వర్ణ మానస సుమన్ ఆధ్వర్యంలో నందికొండ మున్సిపల్ కౌన్సిలర్ లు , మున్సిపల్ సిబ్బందితో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు, ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ సత్యం అహింస మార్గంలో నడిచి దేశానికి స్వతంత్రం సిద్ధించేలా చేసిన మహనీయుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు, గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని వారు చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు పరిశుభ్రతకు గాంధీజీ ఇచ్చిన ప్రాధాన్యతను గుర్తు చేస్తూ నందికొండ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి వార్డులో స్వచ్ఛతను పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నందికొండ మున్సిపల్ కౌన్సిలర్ లు, కో -ఆప్షన్ మెంబర్ లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.