ఆంధ్రప్రదేశ్

నాగేంద్రనగర్, తడపాకల్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

నాగేంద్రనగర్, తడపాకల్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

జనం న్యూస్, అక్టోబర్ 3: ఏర్గట్ల మండలంలోని నాగేంద్రనగర్, తడపాకల్ గ్రామాల్లో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గాంధీజీ చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సత్యం, అహింస, స్వచ్ఛత, గ్రామ స్వరాజ్య ఆశయాలను స్మరించుకున్నారు. నాగేంద్రనగర్‌లో సర్పంచ్ సందె రంజిత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బాల్యవివాహాల నిర్మూలన, బాలికల విద్య, నీటి సంరక్షణపై గ్రామస్థులు ప్రతిజ్ఞ చేశారు. తడపాకల్‌లో సర్పంచ్ జె. స్వప్న అనిల్ కుమార్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం, ఐక్యత అవసరమన్నారు. కార్యక్రమాల్లో అధికారులు, పంచాయతీ సిబ్బంది, మహిళా మండలి ప్రతినిధులు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

ఇ-పేపర్