ఆంధ్రప్రదేశ్

365 రోజులు రోడ్లపై మురికి

365 రోజులు రోడ్లపై మురికి

మున్సిపల్ కార్యాలయం ఉన్నది దేనికి జహీరాబాద్ పట్టణంలోని గొప్ప గొప్ప నాయకులు పెద్దపెద్ద అధికారులు తిరిగాడేది ఈ రోడ్డుపైనే కనీసం సుమోటోగానైనా పురపాలక సంఘంపై కేసు రిజిస్టర్ చేయరు పి. రాములు నేత జాగో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జనం న్యూస్ 03/10/2026 జహీరాబాద్ పట్టణంలో పారిశుద్ధ్యంలోపించి రోడ్లపై మురికి నీరు చేరుకొని సామాన్య ప్రజలకు రాకపోకలకు చాలా ఇబ్బందిగా తయారైంది కొన్ని సందర్భాల్లో ప్రజలు మురికిని తప్పించుకొని వెళ్లే క్రమంలో ప్రమాదాల బారిన పడి గాయాల పాలు అవుతున్నారు పురపాలక సంఘంలో వందకు పైగా పారిశుద్ధ్య కార్మికులు ఉన్నప్పటికీ జహీరాబాద్ పట్టణంలో ఎక్కడ చూసినా చిత్తు కాగితాలు చెత్తకుప్పలతో వీధి పశువులు వీధి కుక్కలతోని రోడ్లపై మురికి నీరు చేరి మురికి కాలువలలో మురికి పేరుకుపోయి విపరీతమైన దోమలు దీని మూలంగా ప్రజలు ఎంతోమంది డెంగు మలేరియా మొదలగు వ్యాధులతోని ఆస్పత్రుల పాలవుతున్నారు వాడల్లో నివసించే చిన్నపిల్లలకు అనేక రకాల వ్యాధులు సోకి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో కనీసం మున్సిపాలిటీ సిబ్బంది పట్టించుకునే పరిస్థితి లేదు ఇక్కడ చూస్తున్న దృశ్యం జహీరాబాద్ పట్టణంలోని మోహన్ థియేటర్ దగ్గర ప్రతిరోజు కనిపిస్తుంది ఈ దృశ్యాన్ని ప్రతిరోజు వార్డు మెంబర్ కాడి నుండి జహీరాబాద్ శాసన శాసనసభ్యుని వరకు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ నుండి రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ వరకు పురపాలక సంఘం పారిశుద్ధ్య సిబ్బంది కాడి నుండి పురపాలక సంఘం కమిషనర్ వరకు ప్రతిరోజు చూస్తున్న పట్టించుకునే పరిస్థితి లేదు ఇది ఎక్కడో ఈ దృశ్యం మారుమూల పల్లెటూరులో అంటే కనీసం అధికారులకు గాని నాయకులకు గాని తెలవలేదు అని అనుకోవచ్చు కోట్ల రూపాయల జనరల్ ఫండ్ నిధులున్న పురపాలక సంఘం పరిధిలోనిది ఈ దారి గుండా ప్రతిరోజు అనేకమంది విద్యావంతులు, విద్యార్థులు కళాశాలల ఉపాధ్యాయులు తిరుగాడుతూ ఈ మురికిని భరిస్తున్నారు తప్ప ఒక అడుగు ముందుకు వేసి కనీసం పురపాలక సంఘం అధికారులకు తమ వంతు బాధ్యతగా కూడా ఎవరు తెలియజేయడం లేదు సమాజం ఇలా సమస్యలను భరించడానికి తయారైపోయింది కనీసం అధికారులు తమరైన ప్రజల పక్షాన నిలిచి ఇలాంటి పరిస్థితులను దూరం చేసి ప్రజలను అనారోగ్యాలు దుర్వాసనల నుండి కాపడవలసిందిగా జహీరాబాద్ ప్రజల పక్షాన జాగో తెలంగాణ కోరడమైనది.

ఇ-పేపర్