లో వోల్టేజ్ సమస్యతో రోడ్డెక్కిన రైతులు స్పందించని విద్యుత్ అధికారులు బిచ్కుంద అక్టోబర్ 3 ( జనం న్యూస్) పార్టీలు వేరైనా రైతులంతా ఒక్కటే జై కిసాన్ నినాదంతో రైతులందరూ తమ సమస్యలు తీర్చుకోవడానికి రోడ్డు ఎక్కినారు. పూర్తి వివరాలు రైతులకు వ్యవసాయానికి అవసరమైన విద్యుత్తు నిరంతరాయంగా, నాణ్యమైన వోల్టేజ్ తో అందించాలని కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని శాంతాపూర్, సీతారాం పల్లి, మానాపూర్, రాజాపూర్, ఎల్లారం రైతులు శాంతాపూర్ సబ్ స్టేషన్ లో తమ నిరసనని వ్యక్తం చేసి 161 జాతీయ రహదారి పైకూర్చొని తమ నిరసనని వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ కోతలు పెరిగాయని లో వోల్టేజ్ సమస్యతో మోటర్లు కాలిపోతున్నాయని ఒక మోటర్ రిపేర్ చేయడానికి దాదాపుగా పదివేల వరకు ఖర్చు అవుతుందని ఇలా నెలకు రెండు మూడు సార్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో సాగు చేసిన పంటలకు అవసరమైన సమయంలో సాగునీరు అందకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు అయోమయానికి గురవుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు ఈ విషయంపై స్పందించలేదని ఆరోపించారు ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని రైతులు ఆరోపిస్తున్నారు. లో వోల్టేజ్ సమస్య సరిదిద్దకపోతే రైతులకు మరణమే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఇంత జరుగుతున్నప్పటికీ కూడా విద్యుత్తు అధికారులు అక్కడికి చేరకపోవడం రైతుల పట్ల ఇది నిర్లక్ష్య ధోరణి అగుపిస్తుందని రైతులు విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీతారాంపల్లి, మాన్యాపూర్, రాజాపూర్, శాంతాపూర్, ఎల్లారం రైతులు పాల్గొన్నారు.