ఆంధ్రప్రదేశ్

తోమాలపల్లి గ్రామ ప్రజలకి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

తోమాలపల్లి గ్రామ ప్రజలకి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోట్ ర్ కటికల శివకుమార్ వనపర్తి జిల్లా పెబ్బేరు 03-10-2026 శనివారం తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలనలో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అర్హులందరికీ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని తోమాలపల్లి గ్రామంలో సర్పంచ్ గుడిసె అశోక్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించడం జరిగింది. గ్రామంలోని లబ్ధిదారులకు రేషన్ స్మార్ట్ కార్డులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గిర్దావర్ రాఘవేంద్ర గారు, జిపిఓ పరమేశ్వర్ గారు, గ్రామ ఉప సర్పంచ్ గుడిసె రాంబాబు గారు, వార్డు మెంబర్లు ఉమేష్ గౌడ్, లక్ష్మి, ఘట్టమ్మ, మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్ గారు, మాజీ ఎంపిటిసి మన్నెం గారు, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు బోరింగ్ శ్రీనివాస గారు, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్