ఆంధ్రప్రదేశ్

పూర్వీకుల జ్ఞాపకార్థం పాఠశాలకు బెంచీల వితరణ

పూర్వీకుల జ్ఞాపకార్థం పాఠశాలకు బెంచీల వితరణ

జనం న్యూస్ అక్టోబర్ 3 కోటబొమ్మాళి మండలం:సింహాద్రిపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం రూ. 12 వేల విలువైన సిమెంట్ బెంచీలను గ్రామ యువత గురువెళ్లి నగేష్, ముద్ద భాస్కరరావు, ముద్ద రాంబాబు తమ పూర్వీకుల జ్ఞాపకార్థం పాఠశాలకు బహూకరించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు గొండు నారాయణరావు, జన్ని భారతి, పాఠశాల చైర్మన్ జయలక్ష్మి మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి గ్రామ యువత ముందుకు వచ్చి సహకరించడం అభినందనీయమన్నారు. విద్యార్థుల సౌకర్యాల కోసం సిమెంట్ బెంచీలు అందించడం పట్ల గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు యువతను అభినందించారు.

ఇ-పేపర్