జనం న్యూస్ 03 అక్టోబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్శ్రీ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలి అఖిల పక్షం. డిమాండ్ సి ఇ సి జ్ఞానేష్ కుమార్ ను తక్షణమే పదవి నుండి తొలగించి,సర్ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని జోగులాంబ గద్వాల జిల్లా అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ కార్యాలయం నుండి ర్యాలీ నిర్వహించి ఐ డి ఓ సి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఉప్పేర్ నరసింహ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్వర్ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు భంగం కలిగిస్తూ ఎన్నికల వ్యవస్థను అబాసుపాలు చేసే విధంగా ఎన్నికల కమిషన్ లోని సభ్యుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు. ఎన్నికల కమిషన్ లో మెజార్టీ అభిప్రాయానికి విలువ ఇవ్వకుండా నిరంకుశంగా సర్ ను అమలు చేయడం వల్ల దేశంలో 13 కోట్ల మంది పౌరుల ఓటు హక్కు కనుమరుగైందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ భద్రతకు పౌరుల హక్కులకు విఘాతం కల్పిస్తున్న బిజెపిపై మొదటి దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి,లోక్ సభలో ప్రతిపక్ష నాయకులతో కూడిన ఎన్నికల గణం అమలులో ఉన్నందున ఎటువంటి అక్రమాలు జరగలేదని, కానీ నేడు చట్టబద్ధ,రాజ్యాంగబద్ధ సంస్థలలోకి బిజెపి నాయకులను పంపించి భారత రాజ్యాంగాన్ని అవ హేళన చేస్తున్నారని విమర్శించారు. భారత ప్రజాస్వామ్యానికి లౌకికవాదానికి రాజ్యాంగానికి ప్రమాదాన్ని తలపెడుతున్న బిజెపి నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా దేశంలోని ప్రజాస్వామిక వాదులు మేధావులు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల వ్యవస్థకే కళంకం తెస్తున్న సి ఇ సి ని తక్షణమే పదవి నుండి తొలగించి పాత పద్ధతిలోనే ఎన్నికల గణాన్ని ఏర్పాటు చేసి, ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణను తక్షణమే నిలిపివేయాలని అన్యాయంగా తొలగించిన ఓటర్లలో అర్హులైన వారిని మళ్ళీ ఓటర్ జాబితాలో చేర్చేంతవరకు ఈ పోరాటం ఆగబోతున్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కి అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ వెంకటస్వామి సీపీఐ జిల్లా కార్యదర్శి బి ఆంజనేయులు, యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి మహేందర్ డి సి సి జిల్లా కార్యదర్శి మధు నాయుడు ఎస్సీ ఎస్టీ రాష్ట్ర వైస్ చైర్మన్ శ్రీనివాస్ బి ఆర్ ఎస్ వి కుర్వ పల్లయ్య టీపీఎఫ్ శంకర ప్రభాకర్ టీజేఎస్ శ్రీనివాస్ సీపీఐ యం యల్ కార్తీక్, సీపీఐ యం యల్ ప్రజా పంథా హరీష్ బి యస్ పి మణి కుమార్ బి ఆర్ యస్ గంజిపేట రాజు, అవాజ్ రేహమతుల్ల,బహుజన రాజ్యసమితి వినోద్, రైతాంగ సమితి గోపాల్ యాదవ్ పి వై ఎల్ దానయ్య ఆర్ ఆర్ ఎస్ కృష్ణ టి యు సి ఐ రంగన్న ప్రజా ఫ్రంట్ నాగన్న పి డి ఎస్ యు హలీం పాషా సిపిఎం రేపల్లె దేవదాసు, వీవీ నరసింహ, జీకే ఈదన్న, మోష తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలతో జోగులాంబ గద్వాల జిల్లా అఖిల పక్షం