ఆంధ్రప్రదేశ్

అక్టోబర్ 3న గద్వాలలో బీసీ రాజ్యాధికార పాదయాత్ర

అక్టోబర్ 3న గద్వాలలో బీసీ రాజ్యాధికార పాదయాత్ర

జనం న్యూస్ 03 అక్టోబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్తీ న్మార్ మల్లన్న, రేలారే గంగా హాజరు భారీగా తరలిరావాలని పిలుపు జోగులాంబ గద్వాల జిల్లా అక్టోబర్ 3వ తేదీన జోగులాంబ గద్వాల జిల్లాలో నిర్వహించనున్న బీసీ రాజ్యాధికార పాదయాత్రకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హాజరుకానున్నారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సింధనూరు గంగాధర్ తెలిపారు. పాదయాత్రలో భాగంగా ప్రముఖ కళాకారిణి రేలారే గంగా అక్క ఆటపాటలతో గద్వాల జిల్లా ప్రజలను అలరించనున్నారని ఆయన పేర్కొన్నారు. అనంతరం గద్వాల పట్టణంలోని కృష్ణవేణి చౌక్ వద్ద సాయంత్రం 5 గంటలకు కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి జోగులాంబ గద్వాల జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని సింధనూరు గంగాధర్ పిలుపునిచ్చారు.
బీసీ రాజ్యాధికార పాదయాత్ర ద్వారా బడుగు బలహీన వర్గాల సమస్యలు సామాజిక న్యాయం ప్రజల హక్కులపై ప్రజల్లో అవగాహన కల్పించనున్నట్లు ఆయన తెలిపారు.కావున జిల్లా ప్రజలు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని బీసీ రాజ్యాధికార పాదయాత్రను, కృష్ణవేణి చౌక్‌లో జరిగే కార్నర్ మీటింగ్‌ను విజయవంతం చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సింధనూరు గంగాధర్ కోరారు.

ఇ-పేపర్