ఆంధ్రప్రదేశ్

బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధికార ప్రతినిధిగా సత్యనారాయణ, జిల్లా కార్యదర్శిగా చంద్రమౌళి నియామకం

బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధికార ప్రతినిధిగా సత్యనారాయణ, జిల్లా కార్యదర్శిగా చంద్రమౌళి నియామకం

జనం న్యూస్ అక్టోబర్ 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం జయశంకర్ భూపాలపల్లి జిల్లా:భారతీయ జనతా పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఓబీసీ మోర్చా జిల్లా అధికార ప్రతినిధిగా మోత్కూరు సత్యనారాయణను, జిల్లా కార్యదర్శిగా కడారి చంద్రమౌళిని నియమించడం జరిగింది.వీరి పై పార్టీనమ్మకంతో, ఓబీసీ మోర్చా బలోపేతానికి కృషి చేస్తరని వీరిద్దరికి పార్టీ నాయకత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ మోత్కూరు సత్యనారాయణ, కడారి చంద్రమౌళికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. పార్టీ అప్పగించిన బాధ్యతలను అంకితభావంతో నిర్వహిస్తూ ఓబీసీ వర్గాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, బీజేపీ సిద్ధాంతాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు. తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి నియోజకవర్గ ఇన్చార్జ్ చందుపట్ల కీర్తి రెడ్డి కి మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ కి మండల నాయకులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్‌లో పార్టీ బలోపేతం కోసం సమష్టిగా పనిచేస్తామని వారు తెలియజేశారు.

ఇ-పేపర్