జనం న్యూస్ అక్టోబర్ 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం మహిళల సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఎం జీ పి బాయ్స్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.
పాఠశాల ప్రిన్సిపాల్ టి. రేవతి మార్గదర్శకత్వంలో నిర్వహించిన ఈ వేడుకల్లో సుమారు 150 మంది విద్యార్థుల తల్లులు, మహిళా ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్ని. విద్యార్థుల తల్లులు, మహిళా ఉపాధ్యాయులు సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మలను వివిధ పువ్వులతో అందంగా అలంకరించి, బతుకమ్మల చుట్టూ పాటలు పాడుతూ ఉత్సాహంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ టి. రేవతి మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విద్యార్థులకు పరిచయం చేయడంలో ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. బతుకమ్మ పండుగ మహిళల ఐక్యత, ప్రకృతి ప్రేమ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లులు, మహిళా ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని సంబరాలు జరుపుకున్నారు.