వైరల్ వార్తలు

నందలూరులో పండుగ వాతావరణం వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌కు ఘన స్వాగతం .

నందలూరులో పండుగ వాతావరణం వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌కు ఘన స్వాగతం .

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా ఆదివారం ఉదయం కాచిగూడ నుండి చిత్తూరు వెళ్లే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ కు నందలూరు రైల్వేస్టేషన్‌లోనందలూరు మండల యువత రాజ కీయ లకు అతీతంగా ఒకే తాటిపైకి వచ్చి అత్యంత ఘనంగా స్వాగతం పలక డం జరిగింది.మండల ప్రజల దశాబ్దాల కలను నెరవేర్చి, నందలూరులో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌కు నిలుపుదల (హాల్ట్) కల్పించిన దక్షిణ కోస్తా రైల్వే, దక్షిణ మధ్య రైల్వే గుంటకల్ డివిజన్ ఉన్నత అధికారులకు నందలూరు యువత, ప్రజలుప్రత్యేకకృతజ్ఞతలు తెలియజేశారు.కార్య క్రమంలో భాగంగా:షెడ్యూల్ ప్రకారం వచ్చిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్, ట్రైన్,మేనేజర్‌ లను పూలమాలలతో ఘనంగా సత్కరించి,తీపి పదార్థాలుపంచిఆనందాన్నిపంచుకోవడంజరిగింది.రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు అలానే ప్రజలకు బిస్కెట్లు,మంచి నీరు పంపిణీ చేశారు.రైలు ఆగిన సందర్భంగా స్థానిక నందలూరు రైల్వే స్టేషన్ అధికారులను, సిబ్బందిని ఘనంగా సత్కరించారు.నంద లూరు పురోగతికి, ప్రయాణికుల సౌకర్యానికి మైలురాయిగా నిలిచిన ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన యువతకు, పెద్దలకు ముఖ్యముగా రైల్వే అధికారులకు నంద లూరు రైల్వే కన్సల్టెంట్ నెంబర్ రాచూరి మురళి ధన్యవాదాలు తెలియ జేశారు.

ఇ-పేపర్