మానవత్వం చాటుకున్న పీఎంకే ఫౌండేషన్
జనం న్యూస్, అక్టోబర్ 4(జిల్లా ఇంచార్జ్ ) రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబానికి పీఎంకే ఫౌండేషన్ అండగా నిలిచింది. జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామానికి చెందిన గిరవేణ శ్యామ్ ఇటీవల జమ్మికుంట పట్టణంలోని ఎఫ్‌సీఐ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల మృతి చెందాడు.
ఈ విషయం తెలుసుకున్న పీఎంకే ఫౌండేషన్ వ్యవస్థాపకులు పల్లె ప్రభాకర్ గౌడ్ శ్యామ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆదేశాల మేరకు ఫౌండేషన్ నిర్వాహకులు కోరపల్లిలోని మృతుడి కుటుంబాన్ని పరామర్శించి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు.భవిష్యత్తులోనూ శ్యామ్ కుటుంబానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్ నిర్వాహకులు పల్లె రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.